Nara Lokesh: స్కిల్ కేసులో నారా లోకేశ్ కు అక్టోబర్ 4 వరకు బెయిల్ మంజూరు.. ఫైబర్ గ్రిడ్ కేసు విచారణ వాయిదా

Nara Lokesh gets bail in Skill development case
షార్ట్స్‌లో చూడండి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. అక్టోబర్ 4వ తేదీ వరకు బెయిల్ ఇచ్చింది. అప్పటి వరకు లోకేశ్ ను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో విచారణను అక్టోబర్ 4 వరకు వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. మరోవైపు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని సీఐడీని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
Skill Development Case
Bail
AP Fibergrid Case

More Telugu News