Nara Lokesh: భారీ ట్విస్ట్.. నారా లోకేశ్ కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసు ఇస్తామన్న ఏజీ.. విచారణ ముగించిన హైకోర్టు

AG told to AP High Court that they will issue CRPC 41 A to Nara Lokesh
  • ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన లోకేశ్
  • లోకేశ్ ను అరెస్ట్ చేయబోమన్న అడ్వొకేట్ జనరల్
  • అరెస్ట్ పై ఆందోళన లేనందువల్ల విచారణను ముగిస్తున్నామన్న హైకోర్టు
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకేశ్ ను అరెస్ట్ చేయబోమని, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఎఫ్ఐఆర్ లో దర్యాప్తు అధికారి మార్పులు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

41ఏ కింద లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఒకవేళ దర్యాప్తుకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తామని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. 41ఏ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందిస్తూ... లోకేశ్ అరెస్ట్ పై ఆందోళన లేనందువల్ల విచారణను ముగిస్తున్నామని తెలిపారు. మరోవైపు, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్టు న్యాయనిపుణులు చెపుతున్నారు.
Nara Lokesh
Telugudesam
Inner Ring Road Case
AP High Court
Anticipatory Bail
CRPC 41 A

More Telugu News