Sidharth Luthra: చంద్రబాబు కేసు వాదిస్తుండడంతో ఎక్కడికెళ్లినా నాపై అభిమానం చూపిస్తున్నారు: సిద్ధార్థ లూథ్రా

Sidharth Luthra interesting post in social media
  • 'స్కిల్' కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపిస్తున్న సిద్ధార్థ లూథ్రా 
  • లూథ్రా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
  • చంద్రబాబు కేసు వాదిస్తుండడంతో తన పాప్యులారిటీ పెరిగిపోయిందని వెల్లడి
టీడీపీ అధినేత చంద్రబాబు 'స్కిల్' కేసులో అరెస్టయినప్పటి నుంచి, ఆయనతో ముడిపడి ఎక్కువగా వినిపిస్తున్న పేరు... సిద్ధార్థ లూథ్రా. సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. అనేక సంక్లిష్టమైన కేసుల్లో విజయం సాధించిన అనుభవజ్ఞుడైన న్యాయవాది. 'స్కిల్' కేసులో అరెస్ట్ అయ్యాక చంద్రబాబు తరఫున లూథ్రానే వాదనలు వినిపిస్తున్నారు. దాంతో ఆయన పేరు కూడా చంద్రబాబుతో పాటే మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో సిద్థార్థ లూథ్రా ఆసక్తికర అంశాన్ని పంచుకున్నారు. చంద్రబాబు కేసులు వాదిస్తున్న పుణ్యమా అని తన పాప్యులారిటీ పెరిగిపోయిందని పేర్కొన్నారు. తాను ఎక్కడికెళ్లినా తనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని లూథ్రా వెల్లడించారు. 

"ఏపీ ప్రజలు చంద్రబాబు పట్ల చూపే గౌరవాభిమానాలను ఇప్పుడు నాపైనా కురిపిస్తున్నారు. నేనెక్కడికి వెళ్లినా ఆత్మీయంగా పలకరిస్తున్నారు. అందుకు నేను ధన్యుడ్ని" అంటూ ఎక్స్ లో స్పందించారు.
Sidharth Luthra
Chandrababu
Skill Case
Senior Advocate
Supreme Court
TDP
Andhra Pradesh

More Telugu News