Suriya: వీరాభిమాని మృతి పట్ల చలించిపోయిన హీరో సూర్య

Hero Suriya offers condolences to his fan death
  • రోడ్డు ప్రమాదంలో సూర్య అభిమాని అరవింద్ మృతి
  • అరవింద్ నివాసానికి వెళ్లిన సూర్య... చిత్రపటానికి నివాళులు
  • శోకసంద్రంలో ఉన్న అరవింద్ కుటుంబ సభ్యులకు సూర్య ఓదార్పు

హీరో సూర్య వీరాభిమాని అరవింద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన ఫ్యాన్ క్లబ్ లో సభ్యుడిగా ఉంటూ సేవా కార్యాక్రమాల్లో విరివిగా పాల్గొనే అరవింద్ మృతి సమాచారం తెలుసుకున్న హీరో సూర్య చలించిపోయారు. చెన్నైలోని ఎన్నూర్ లో అరవింద్ నివాసానికి వెళ్లిన సూర్య... శోకసంద్రంలో ఉన్న తన అభిమాని కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. అరవింద్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అరవింద్ కుటుంబానికి అండగా ఉంటానని సూర్య పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News