spa manager: మహిళా వ్యాపార భాగస్వామిని చితకబాదిన స్పా మేనేజర్

Caught on CCTV Ahmedabad spa manager assaults woman drags her by hair
  • గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఘటన
  • నాలుగు నిమిషాల పాటు.. దుస్తులు చిరిగేలా కొట్టిన వ్యక్తి
  • వీడియో వైరల్ కావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు

అహ్మదాబాద్ లో ఓ స్పా నిర్వాహకుడు, తన వ్యాపార భాగస్వామి అయిన మహిళపై దాడి చేసి చితకబాదాడు. బహుళ అంతస్తుల భవనంలో స్పా ఆవరణలో టెర్రాస్ పై మహిళ జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లడం, ఆమెపై చేయి చేసుకోవడం, చెంపలు పగులగొట్టడం ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇలా నాలుగు నిమిషాల పాటు ఆ మహిళపై దాడి కొనసాగినట్టు తెలుస్తోంది. 

స్పా నిర్వాహకుడు మోహిసిన్ ఆ మహిళను బలవంతంగా స్పా లోపలికి ఈడ్చుకుపోవడం చూడొచ్చు. కొంత వ్యవధి తర్వాత ఆ డోర్ ను తన్నుకుని మహిళా బయటకు వచ్చింది. ఆమె కుర్తా చినిగిపోయి పేలికలుగా కనిపిస్తోంది. దుస్తులు చినిగేంతగా అతడు ఆమెపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో చూసే వారి మనసును కదిలించే విధంగా ఉంది. ఈ ఘటన ఈ నెల 25న జరిగింది. 

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చేరి, వైరల్ గా మారిపోవడంతో, పోలీసులు రంగంలోకి దిగారు. గెలాక్సీ స్పా నిర్వాహకుడు మోహిసిన్ కు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఈ దాడి జరిగి రెండు రోజులు గడిచినప్పటికీ బాధిత మహిళ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదూ ఇవ్వలేదు. సోషల్ వర్కర్ సాయంతో సదరు మహిళను పోలీసులు సంప్రదించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించారు. మోహిసిన్ తనకు స్పాలో వ్యాపార భాగస్వామిగా ఉన్నట్టు ఆమె పోలీసులకు చెప్పింది.

  • Loading...

More Telugu News