Laddu Auction: హైదరాబాద్ లో వేలంపాటలో రూ. 1.26 కోట్లు పలికిన వినాయకుడి లడ్డూ.. ఎక్కడంటే..!

Bandlaguda vinayaka laddu auction for 1 CR 26 Laks
  • బండ్లగూడ జాగీర్ లో కళ్లు చెదిరే ధరకు లడ్డూ వేలం
  • కీర్తి రిచ్మండ్ విల్లాలో వేలంపాట నిర్వహణ
  • గత ఏడాది రూ. 60.80 లక్షలు పలికిన లడ్డూ
హైదరాబాద్ నగరం మొత్తం జై గణేష్ నామస్మరణతో మారుమోగుతోంది. గణేశ్ ఉత్సవాల్లో చివరి రోజైన ఈరోజు వేలాది వినాయకులు నిమజ్జనాలకు తరలుతున్నాయి. ఈ క్రమంలో లడ్డూ వేలంపాటలు కూడా పోటీపోటీగా సాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ లో వినాయకుడి లడ్డూకు కళ్లు చెదిరే ధర పలికింది. కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో నిర్వహించిన వేలంపాటలో లడ్డూ ఏకంగా రూ. 1.26 కోట్లు పలికింది. ఎన్నడూ లేని విధంగా ఇంత ధర పలకడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత ఏడాది కూడా ఇక్కడి గణపతి లడ్డూ రికార్డు స్థాయిలోనే ధర పలికింది. పోయిన సంవత్సరం రూ. 60.80 లక్షలు పలకగా... ఈ ఏడాది రెండింతలు ఎక్కువ ధర పలికింది.  

Laddu Auction
Vinayaka
Bandlaguda

More Telugu News