Virat Kohli: ఆసీస్ ఆటగాడితో కోహ్లీ ఫన్... వీడియో ఇదిగో!

Kohli makes fun with Aussies batter Marnus Labuschagne
  • రాజ్ కోట్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్
  • డ్రింక్స్ బ్రేక్ లో లబుషేన్ తో సరదాగా మాట్లాడిన కోహ్లీ
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
ఇవాళ రాజ్ కోట్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య 3వ వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తుండగా డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. డ్రెస్సింగ్ రూం నుంచి డ్రింక్స్ తో వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు వేడి వాతావరణం భరించలేకపోయిన స్మిత్ కు తలపై ఐస్ ఉంచారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కోహ్లీ... ఆసీస్ బ్యాటర్ లబుషేన్ తో సరదాగా మాట్లాడడం కెమెరా కంటికి చిక్కింది. తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కోహ్లీ.. లబుషేన్ తో ఫన్నీగా మాట్లాడినట్టు విజువల్స్ చెబుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
Virat Kohli
Marnus Labuschagne
Drinks Break
3rd ODI
Team India
Australia
Rajkot

More Telugu News