Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

ACB Court adjourns Chandrababu bail and custody petitions hearing to October 4
  • స్కిల్ కేసులో బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు
  • బాబు కస్టడీని పొడిగించాలని సీఐడీ పిటిషన్
  • రెండు పిటిషన్ల విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విజయవాడలోని ఏసీబీ కోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు కొంత నిరాశను, ఇదే సమయంలో కొంత ఉపశమనాన్ని కలిగించింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ లపై విచారణను ఏసీబీ కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ రాకపోవడం చంద్రబాబుకు నిరాశను కలిగిస్తే... సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా వాయిదా వేయడం ఆయనకు కొంత ఉపశమనాన్ని కలిగించే అంశమే. అక్టోబర్ 4వ తేదీ వరకు సీఐడీ అధికారుల విచారణను ఆయన ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు నిరాశే ఎదురయింది.  

Chandrababu
Telugudesam
Bail
Custody
ACB Court

More Telugu News