RGV: ఈ అమ్మాయి ఎవరో నాకు చెబుతారా?: రామ్ గోపాల్ వర్మ

  • సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టిన వర్మ
  • ఓ అందమైన అమ్మాయి వీడియో పంచుకున్న ఆర్జీవీ
  • ఎవరీ అమ్మాయి అంటూ నెటిజన్ల చర్చ
RGV asks netizens who is this girl

దర్శకులందరిలోకి రామ్ గోపాల్ వర్మ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన కెమెరా దృష్టి ఎప్పుడూ కొత్త కోణాలను వెతుకుతుంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే వర్మ చేసిన తాజా పోస్టు వైరల్ అవుతోంది. చీరకట్టులో ఉన్న ఓ అందాలభామ చేతిలో కెమెరాతో వయ్యారాలు ఒలకబోయడాన్ని వర్మ పంచుకున్న వీడియోలో చూడొచ్చు. అయితే ఆ వీడియోలో ఉన్న కెమెరా సుందరి ఎవరో మాత్రం తెలియదు. వర్మ కూడా అదే అడిగారు... ఈవిడ ఎవరో నాకు చెబుతారా? అంటూ ఆరా తీసే ప్రయత్నం చేశారు. వర్మ కంట్లో పడిన అమ్మాయి కావడంతో, ఈవిడపై నెట్టింట భారీగానే చర్చ జరుగుతోంది.

More Telugu News