గోవులను కబేళాకు అమ్ముకుంటున్నారు.. ఇస్కాన్ పై మేనకా గాంధీ ఆరోపణలు
- దారుణ మోసాలకు పాల్పడుతున్నారన్న బీజేపీ ఎంపీ
- గోశాలల నిర్వహణలో అవకతవకలు..
- ఎంపీ ఆరోపణలను ఖండించిన ఇస్కాన్ ప్రతినిది
ఇటీవల అనంతపూర్ లోని ఇస్కాన్ గోశాలను సందర్శించినట్లు ఎంపీ మేనకా గాంధీ చెప్పారు. అయితే అక్కడ ఒక్క ఆవు కూడా లేదని, అన్నింటినీ కబేళాకు అమ్మేశారని మండిపడ్డారు. గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయి వాళ్లకు అమ్ముకునే ఇలాంటి వాళ్లే రోడ్లపై హరేరామ.. హరేకృష్ణ అంటూ వల్లెవేస్తుంటారని విమర్శించారు.
అయితే, ఎంపీ మేనకా గాంధీ ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. గో సంరక్షణలో ఇస్కాన్ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేసింది. గోశాలకు వచ్చిన గోవులను కడవరకూ జాగ్రత్తగా సంరక్షిస్తామని సంస్థ ప్రతినిధి యుధిష్టర్ గోవిందా దాస్ ట్వీట్ చేశారు.