Chandrababu Arrest: చంద్రబాబు కేసు అప్‌డేట్స్.. ఎస్ఎల్‌పీపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu Case To Hear Supreme Court Today
  • తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు పిటిషన్
  • విచారించనున్న జస్టిస్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి  నేతృత్వంలోని ధర్మాసనం
  • అమరావతి రింగురోడ్డు కేసు నేడు విచారించనున్న ఏపీ హైకోర్టు

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్ఎల్‌పీపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను గత శుక్రవారం హైకోర్టు కొట్టివేయడంతో శనివారం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడిది జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఐటం 61 కింద ఈ కేసు లిస్ట్ అయింది. 

నిజానికీ కేసు విచారణ నిన్ననే జరగాల్సి ఉండగా సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవడంతో ఈ కేసు ఆయన ముందుకు రాలేదు. అయితే, ఈ కేసును అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇచ్చిన మెన్షనింగ్ స్లిప్‌ను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి ధర్మాసనం ముందు జాబితా చేసినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు జుడీషియల్ రిమాండ్‌ను రెండుసార్లు పొడిగించడంతో అక్టోబరు 5 వరకు ఆయన జైల్లోనే ఉండనున్నారు. మరోవైపు, అమరావతి రింగురోడ్డు కేసు విచారణ నేటి మధ్యాహ్నం 2.15 గంటలకు ఏపీ హైకోర్టు విచారించనుంది. ఈ కేసులో బెయిలు కోరుతూ టీడీపీ అధినేత ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News