Bandi Sanjay: గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదు: బండి సంజయ్

Bandi Sanjay suggest dont do politics on governor decisions
  • ప్రభుత్వం ఏ ఫైలు పంపించినా దానిపై ముద్ర వేస్తే గవర్నర్ మంచివారు అంటారని వ్యాఖ్య
  • గవర్నర్ తప్పును తప్పు అని చెబితే రాజకీయాలు అంటగడతారని ఆగ్రహం
  • గవర్నర్ రబ్బర్ స్టాంపులా ఉండాలని బీఆర్ఎస్ భావిస్తోందన్న బండి సంజయ్

గవర్నర్‌కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే చెడ్డవారు అవుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వం ఏ ఫైలు పంపించినా దానిపై ముద్ర వేస్తే గవర్నర్‌ను మంచివారు అంటారని, లేకుంటే తప్పులు పడతారన్నారు. గవర్నర్ తన విచక్షణాధికారాలు వినియోగించి తప్పును తప్పు అని చెబితే రాజకీయాలు అంటగడుతున్నారన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు గవర్నర్ ఓ రబ్బర్ స్టాంప్‌లా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.

  • Loading...

More Telugu News