Aleru Mla: ఆలేరు ఎమ్మెల్యేకు ఫైన్ వేసిన హైకోర్టు

Aleru Mla Gongadi Sunitha Fined By Telangana High Court
  • ఓ కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కోర్టు సీరియస్
  • రూ.10 వేల జరిమానా విధించిన హైకోర్టు జస్టిస్
  • వచ్చే నెల 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

ఆలేరు ఎమ్మెల్యేపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. ఎమ్మెల్యే తీరుపై సీరియస్ అయిన కోర్టు.. రూ. 10 వేల జరిమానా విధించింది. అక్టోబర్ 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

2018 ఎన్నికల సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పొందుపరిచారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌లో ఆలేరుకు చెందిన బోరెడ్డి అయోధ్య రెడ్డి ఇంప్లీడ్ అయ్యారు. ఆస్తుల లెక్కలు సరిగా చూపలేదని, సునీత ఎన్నిక చెల్లదంటూ సతీశ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ పై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేకు ఫైన్ విధించిన కోర్టు.. ఈ కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News