Vijayasai Reddy: రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టిస్తున్నారు: విజయసాయిరెడ్డి

VijayaSaiReddy blames tdp for sympothy politics
  • సింపతీని రక్తి కట్టించేందుకు డబ్బిచ్చి జనాల్ని తీసుకొస్తున్నారని ఆరోపణ
  • టీడీపీకి ఇది కొత్త ఏమీ కాదని చురకలు
  • డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఆ పార్టీ నమ్మకమని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబుపై సింపతీ చూపించేందుకు డబ్బులు ఇచ్చి జనాలను తీసుకు వస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారని, ఇది వాళ్లకు కొత్తేం కాదని, డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ అని, ఆ పార్టీ పునాదులే దోపిడీ పైన ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు, లోకేశ్ సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అని అంతకుముందు ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమేనని పేర్కొన్నారు.
Vijayasai Reddy
Andhra Pradesh
Chandrababu

More Telugu News