Kaarthi: నేను ఆమెను ఎప్పుడూ అమ్మగానే చూశా.. వదినగా చూడలేదు: హీరో కార్తీ

Actor Kaarthi says he looked Jyothika as mother
  • సూర్య, జ్యోతిక ముంబైకి వెళ్లడంపై కార్తీ ఆవేదన
  • అమ్మలేని ఇల్లు బోసిపోతోందని వ్యాఖ్య
  • అమ్మలేని ఇంట్లో ఉండలేకపోతున్నానన్న సూర్య
తన వదిన, సినీ నటి జ్యోతికపై హీరో కార్తీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆమెను తానెప్పుడూ వదినగా చూడలేదని, అమ్మగానే చూశానని కార్తీ చెప్పారు. తన పిల్లల్లో ఒక్కడిగానే వదిన తనను చూసుకుందని అన్నారు. ఇప్పుడు అమ్మ చెన్నైలోని ఇంటిని వదిలి ముంబైలో ఉండటం బాధగా ఉందని... అమ్మ లేని ఇల్లు బోసిపోతోందని చెప్పారు. అమ్మలేని ఇంట్లో ఉండలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల పాటు ఉమ్మడి కుటుంబంలా అందరం కలిసి ఉన్నామంటే దానికి అమ్మే కారణమని చెప్పారు. అన్నయ్య సూర్య పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని... పిల్లల చదువుల కోసమే వారు ముంబై వెళ్లారని తెలిపారు. ప్రస్తుతానికైతే పండుగల్లో కలుసుకుంటున్నామని చెప్పారు. మళ్లీ అందరం కలిసి ఉండే రోజు కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. కార్తీ చేసిన పోస్ట్ ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
Kaarthi
Jyothika
Tollywood
Kollywood

More Telugu News