Chandrababu: చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

CID Court adjourns hearing of Chandrababu bail and custody petitions
  • రెండు పిటిషన్లపై వాదనలను రేపటికి వాయిదా వేసిన కోర్టు
  • కస్టడీ పిటిషన్ పై సీఐడీ మోమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని వెల్లడి
  • రెండు పిటిషన్లపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామన్న న్యాయస్థానం

టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన పిటిషన్లపై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్, సీఐడీ కస్టడీ పిటిషన్ లపై రేపు విచారిస్తామని తెలిపింది. కస్టడీ పిటిషన్ పై సీఐడీ మెమో దాఖలు చేసిన తర్వాత విచారణ జరుపుతామని చెప్పింది. రేపు కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న తర్వాత... రెండింటిపై ఒకేసారి ఆదేశాలను వెలువరిస్తామని తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై దేన్ని ముందు విచారించాలో రేపు నిర్ణయిస్తామని వెల్లడించింది. మరోవైపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను రేపు ప్రస్తావించడానికి సుప్రీంకోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News