Ravikrishna: '7జి బృందావన కాలని' పార్టు 2కి రంగం సిద్ధం: హీరో రవికృష్ణ

Ravikrishna Interview
  • 2004లో వచ్చిన '7జి బృందావన కాలని'
  • యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన సినిమా 
  • రీ రిలీజ్ కి వచ్చినా భారీ రెస్పాన్స్ 
  • సీక్వెల్ దిశగా మొదలైన పనులు  

తెలుగులో యూత్ ను ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రేమకథా చిత్రాలలో '7జి బృందావన కాలని' ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులో భారీ వసూళ్లను రాబట్టింది. శ్రీరాఘవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రవికృష్ణ - సోనియా అగర్వాల్ జంటగా నటించారు. రీసెంటుగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 

ఈ సందర్భంగా చాలా కాలం తరువాత రవికృష్ణ కెమెరా ముందుకు వచ్చాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "దర్శకుడు సెల్వరాఘవన్ లైఫ్ స్టోరీ ఇది. ఆయన నా బలం .. బలహీనతను గ్రహిస్తూ, అందుకు తగిన విధంగా ఆ పాత్రను డిజైన్ చేశారు. ఆ సినిమా చేసిన తరువాత మూడు .. నాలుగు నెలల పాటు నేను ఆ పాత్రలో నుంచి బయటికి రాలేకపోయాను" అని అన్నాడు. 

"ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు. ఒక వైపున ఫాదర్ .. మరో వైపున సెల్వ రాఘవన్ బిజీ. ఇక వచ్చేనెల నుంచి ఈ సినిమా సీక్వెల్ సెట్స్ పైకి వెళుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి .. మ్యూజిక్  సిటింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ఎనౌన్స్ మెంట్ వస్తుంది" అని చెప్పాడు. 

  • Loading...

More Telugu News