Ganesh idols: వినాయక నిమజ్జనాలకు హైకోర్టు కీలక సూచన

Ban on PoP Ganesh idols immersion in Hussain Sagar
  • ట్యాంక్ బండ్ పై పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశం
  • కృత్రిమ కొలనుల్లోనే చేయాలని స్పష్టం చేసిన హైకోర్టు
  • గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచన

జంటనగరాల్లో వినాయక నిమజ్జనానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాంక్ బండ్ పై పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి కృత్రిమ కొలనులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చూడాలని, పీవోపీ విగ్రహాల నిమజ్జనం విషయంలో తగు చర్యలు తీసుకోవాలని సీపీకి సూచించింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి, అమలు చేసిన విధానానికి సంబంధించి కోర్టుకు నివేదిక సమర్పించాలని పేర్కొంది. జంటనగరాల్లోని పీవోపీ విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనుల్లోనే చేయాలని హైకోర్టు మరోమారు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News