Parineeti Chopra: పెళ్లి వేడుకలో అందంగా మెరిసిపోయిన పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా.. ఫొటోలు ఇవిగో!

Parineeti Chopra And Raghav Chadda Wedding Photos Gone Viral
  • నిన్న పెళ్లి బంధంతో ఒక్కటైన జంట
  • పరిమిత సంఖ్యలో హాజరైన అతిథులు
  • చాన్నాళ్లుగా ప్రేమలో ఉన్న చోప్రా, చద్దా

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ వేడుక రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో ఉన్న పిచోలా సరస్సు ఒడ్డున అంగరంగ వైభవంగా జరిగింది. పరిమిత సంఖ్యలో అతిథులు మాత్రమే హాజరైన ఈ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లెహెంగాలో పరిణీతి, పవన్ సచ్‌దేవా డిజైన్ చేసిన డ్రెస్ రాఘవ్ చద్దా మెరిసిపోయారు.
తమ పెళ్లి వేడుక ఫొటోలను రాఘవ్‌ చద్దా ఈ రోజు సోషల్ మీడియాలో షేర్‌‌ చేశారు. ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ ఇద్దరూ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. అక్కడ మొదలైన స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News