Couple: ఢిల్లీ మెట్రోలో రెచ్చిపోయిన మరో ప్రేమ జంట.. ప్యాసింజర్ల మండిపాటు

Video Of Couple Kissing In Delhi Metro Coach Goes Viral
  • కౌగిలించుకుని బహిరంగంగా ముద్దులు
  • అసౌకర్యానికి గురైన తోటి ప్రయాణికులు
  • చర్యల్లేకపోవడంతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న ప్రేమికులు
ఢిల్లీ మెట్రో యువ ప్రేమ జంటలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. నిత్యం లక్షలాది మందికి ప్రధాన రవాణా సాధనం అయిన ఢిల్లీ మెట్రోలో.. ఇప్పటికే ఎన్నో ప్రేమ జంటల శృంగార చేష్టలు వెలుగు చూశాయి. ఓపక్క తోటి ప్రయాణికులు అభ్యంతర పెడుతున్నా, ఏ మాత్రం పట్టింపు లేకుండా బరితెగించి, అందరి ముందే ఏకాంత చేష్టలతో అసౌకర్యానికి కారణమవుతున్నారు. తాజాగా మరో ప్రేమ జంట మెట్రో కోచ్ లో కౌగిలించుకుని, ముద్దులాడుకోవడం వెలుగు చూసింది.

తోటి ప్రయాణికుల్లో ఒకరు దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఇది చోటు చేసుకుంది. దీనిపై తోటి ప్రయాణికులు, నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రయాణికులు ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడొద్దంటూ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ పదే పదే కోరుతోంది. కానీ, కేసులు నమోదు చేయడం, తదితర కఠిన చర్యల్లేకపోవడంతో ప్రేమ జంటలకు బెదురు లేకుండా పోయింది. ప్రేమ గుడ్డిది కానీ, తోటి ప్రజలు కాదనే విషయాన్ని మరిచినట్టున్నారంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరో యూజర్ అయితే ప్రేమ జంటకు మద్దతుగా కామెంట్ చేశారు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా వారిలో వారే ముద్దు పెట్టుకుంటే తప్పు ఏముంది? ఇతరుల జీవితాల్లోకి తొంగి చూడడం తప్ప మీకు వేరే పని లేదా? అంటూ నిలదీయడం గమనార్హం.
Couple
Kissing
Delhi Metro
Viral Videos

More Telugu News