Nara Bhuvaneswari: అన్నవరం సత్యనారాయణస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణి

Nara Bhuvaneswari and Brahmani offers prayers in Annavaram Temple
  • సత్యదేవుడిని దర్శించుకున్న భువనేశ్వరి, బ్రాహ్మణి
  • అక్రమ కేసు నుంచి చంద్రబాబు బయటపడాలని ప్రార్థించిన వైనం
  • బాబు అరెస్ట్ కు నిరసనగా కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల రిలే నిరాహార దీక్షలు
అన్నవరం సత్యనారాయణ స్వామి వారిని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి దర్శించుకున్నారు. సత్యదేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రమ కేసు నుంచి చంద్రబాబు బయటపడాలని వారు దేవుడిని ప్రార్థించారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నిరసన దీక్షల్లో పాల్గొంటున్నవారికి భువనేశ్వరి, బ్రాహ్మణిలు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలు అన్నవరంకు వచ్చిన నేపథ్యంలో అక్కడకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
Nara Bhuvaneswari
Brahmani
Annavaram
Telugudesam

More Telugu News