Comments On Hindu Gods: హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో కామెంట్స్.. యూపీలో 15 ఏళ్ల విద్యార్థిని రిమాండ్ హోంకు పంపిన పోలీసులు

10 Class Boy Sent To Remand Home After Social Media Comments On Hindu Gods
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన కామెంట్స్
  • బీజేపీ, హిందూ సంస్థల ఆగ్రహం
  • విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో పదో తరగతి విద్యార్థిని నిర్బంధించారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. విద్యార్థి చేసిన కామెంట్స్ హిందూ సంస్థల ఆగ్రహానికి కారణమైందని స్థానిక బీజేపీ నాయకుడు మింటు సింగ్ పేర్కొన్నారు.

విద్యార్థి చేసినట్టుగా చెబుతున్నట్టు సోషల్ మీడియా కామెంట్స్ స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. బీజేపీ నాయకులు, హిందూ సంస్థల ప్రతినిధులు ఇజాత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విద్యార్థిపై ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ఫర్మేషన్ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకుని రిమాండ్ హోంకు తరలించారు.
Comments On Hindu Gods
Uttar Pradesh
Izatnagar

More Telugu News