Vijayasai Reddy: చంద్రబాబు గారూ! కేసును మీరే మరింత జటిలం చేసుకున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasaireddy says chandrababu facing much trouble with his petitions
  • ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారన్న విజయసాయిరెడ్డి
  • కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండ్ విధించిందని వెల్లడి
  • క్వాష్ పిటిషన్ వేసి హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారని విమర్శలు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తప్పు చేస్తున్నారంటూ వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన శనివారం సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. చంద్రబాబు లక్ష్యంగా ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా మరోసారి ఓ ట్వీట్ చేశారు.

చంద్రబాబు గారు కేసును తప్పుదోవ పట్టించి మరింత జటిలం చేసుకున్నారని పేర్కొన్నారు. ఏ నేరం చేయలేదని బుకాయిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేయించారని, కానీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందునే కోర్టు రిమాండు విధించిందన్న విషయాన్ని లెక్క చేయకుండా మెయింటెయినబుల్ కాని క్వాష్ పిటీషనుతో హైకోర్టుతో అక్షింతలు వేయించుకున్నారన్నారు.

  • Loading...

More Telugu News