Chinta Mohan: 49 ఏళ్లుగా చంద్రబాబు నాకు తెలుసు.. చిన్న తప్పు చేయడానికి కూడా భయపడతారు: చింతా మోహన్

Chandrababu will not do any mistake says Chinta Mohan
  • జనాలు ఏమనుకుంటారోనని తమ్ముడికి కూడా సాయం చేయని వ్యక్తి చంద్రబాబు అని చింతా మోహన్ కితాబు
  • చంద్రబాబు అరెస్ట్ టీడీపీకే అనుకూలంగా మారిందని వ్యాఖ్య
  • రూ. 17 వేల కోట్లు ఏమైపోయాయో టీటీడీ చెప్పాలని డిమాండ్
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు 49 ఏళ్లుగా తెలుసని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ తెలిపారు. చిన్న తప్పు చేయడానికి కూడా చంద్రబాబు భయపడతారని ఆయన అన్నారు. తన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడికి మేలు చేసినా జనాలు ఏమి అనుకుంటారోనని, సీఎంగా ఉండి కూడా సాయం చేయని మనస్తత్వం చంద్రబాబుదని కితాబునిచ్చారు. రాజకీయ కక్షల్లో భాగంగానే చంద్రబాబుపై కేసులు పెట్టారని, ఇలాంటి రాజకీయాలు సమాజానికి మంచిది కాదని అన్నారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వైసీపీ తీసుకున్న చంద్రబాబు అరెస్ట్ నిర్ణయం... టీడీపీకే అనుకూలంగా మారిందని చెప్పారు. తప్పు చేయని చంద్రబాబు జైల్లో... తప్పులు చేసిన జగన్ బెయిల్ పై బయట ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏపీ స్పీకర్ తమ్మినేనిపై ఎమ్మెల్యేలకు నమ్మకం లేదని చింతా మోహన్ అన్నారు. మహిళా రిజర్వేషన్లపై బీజేపీ చేస్తున్నది ఎన్నికల స్టంట్ మాత్రమేనని చెప్పారు. టీటీడీకి చెందిన రూ. 17 వేల కోట్ల నిధులు, బంగారం నిల్వలు ఏమైపోయాయో టీటీడీ అధికారులు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 17 వేల కోట్లను వడ్డీ కోసం ఇచ్చామని టీటీడీ అధికారులు చెపుతున్నారని... ఎక్కడ ఇచ్చారని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు.
Chinta Mohan
Chandrababu
Telugudesam
Jagan
YSRCP
TTD

More Telugu News