Lavanya Tripathi: చీరకట్టులో విరిసిన లావణ్యం .. లావణ్య త్రిపాఠి లేటెస్ట్ పిక్స్!

Lavanya Tripathi Special
  • గ్లామర్ పరంగా మెప్పించిన లావణ్య త్రిపాఠి 
  • తెలుగులో తగ్గిన అవకాశాలు
  • చేతిలో ఉన్న తమిళ సినిమా 
  • సొషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న హీరోయిన్  

లావణ్య త్రిపాఠి తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత కూడా మంచి స్టార్ డమ్ ఉన్న హీరోలతోనే సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే కొంతకాలంగా ఆమెను వరుస ఫ్లాపులు వెంటాడుతూ వస్తున్నాయి. ఫలితంగా అవకాశాలు తగ్గుతూ వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే ఆమె వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టింది. 'పులి మేక' వంటి వెబ్ సిరీస్ లు మంచి ఆదరణ పొందాయి. ప్రస్తుతం ఆమె తమిళంలో అధర్వ మురళి సరసన నాయికగా ఒక సినిమా చేస్తోంది. ఈ సినిమా విడుదలైతే తమిళంలో బిజీ అవుతాననే నమ్మకంతో ఆమె ఉంది. మరో వైపున సోషల్ మీడియాలో కూడా ఆమె సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఆమె నుంచి వచ్చిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. చీరకట్టులో లావణ్య అందంగా మెరుస్తోంది. పెద్దగా జ్యుయలరీ వాడకుండా సింపుల్ గా కనిపిస్తూనే మనసులు దోచేస్తోంది. లావణ్యానికి కేరాఫ్ అడ్రెస్ గా అనిపిస్తోంది. త్వరలో ఈ బ్యూటీ సీనియర్ స్టార్ హీరోలకు జోడీగా కనిపించే అవకాశాలు కూడా లేకపోలేదు.
Lavanya Tripathi
Actress
Tollywood

More Telugu News