Jagan: వైరల్ ఫీవర్, జలుబు, దగ్గుతో బాధ పడుతున్న జగన్

CM Jagan is suffering from viral fever
  • కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న జగన్
  • చికిత్స తీసుకుంటున్నా ఇంకా పూర్తిగా తగ్గని జ్వరం
  • నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం జగన్ మాట్లాడకుండా, తన ఛైర్ లో కూర్చుండిపోయారు. 

అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతుండగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సమాచారం జగన్ కు అందింది. ఈ విషయం గురించి కూడా ఆయన సభలో ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. దీని గురించి ఒక స్లిప్ ను బుగ్గనకు పంపించారు. స్లిప్ చదివిన బుగ్గన చంద్రబాబు విషయాన్ని సభలో ప్రకటించారు. మరోవైపు, వైరల్ ఫీవర్ నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, వైసీపీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నారు.
Jagan
YSRCP
Viral Fever

More Telugu News