Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Pocharam Srinivas Reddy on chandrababu arrest
  • రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ జరిగిందని వ్యాఖ్య
  • రాజకీయాల్లో ఇలాంటి తీరు సరికాదన్న తెలంగాణ శాసన సభ స్పీకర్
  • ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయవద్దని హితవు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఆయన ఖండించారు. ఈ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ జరిగిందని, రాజకీయాల్లో ఇలాంటి తీరు సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని సూచించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని గుర్తించాలన్నారు.

కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై, రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం రెండు రోజుల సీఐడీ కస్టడీకి అప్పగించింది.

  • Loading...

More Telugu News