'మొసలి కన్నీరు మాయం' అంటూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర ట్వీట్

Governor Tamilisai interesting tweet over womens reservation bill nod
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, సామాజిక, రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించే తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందడంపై తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లును ప్రధాని మోదీ విజయవంతంగా ఆమోదింపజేశారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రికి దేశం మొత్తం ధన్యవాదాలు తెలుపుతోంది. రాజకీయవారసులు, రాజవంశీకుల మొసలి కన్నీరు దార్శనిక నాయకుల చొరవ ముందు మాయమయ్యాయి’ అని గవర్నర్‌ తమిళిసై ట్వీట్ చేశారు. అయితే, గవర్నర్‌ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారన్న దానిపై చర్చ మొదలైంది. మహిళా బిల్లు ఆమోదం తమ వల్లే సాధ్యమైందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వారసులు, రాజవంశీకులను కూడా ప్రస్తావిస్తూ గవర్నర్‌ చేసిన ట్వీట్‌ చర్చకు దారితీసింది.
Go Back to Shorts
Telangana
Tamilisai Soundararajan
womens reservation bill
Narendra Modi

More Telugu News