Chandrababu: చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ బాపట్లలో బీచ్ ఆర్ట్... ఫొటోలు ఇవిగో!

Bapatla TDP Incharge Vegeshna Narendra Varma sculpts beach art of Chandrababu
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిరసన తెలిపేందుకు కళారూపాన్ని ఎంచుకున్న నరేంద్ర వర్మ
  • బాపట్ల బీచ్ లో చంద్రబాబు సైకత కళాకృతి
  • సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ సాయంతో చంద్రబాబు చిత్రం 
  • కార్యక్రమంలో పాల్గొన్న చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేయడంపై నిరసన తెలిపేందుకు, టీడీపీ బాపట్ల ఇన్చార్జి వేగేశ్న కళారూపాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ బాపట్ల సముద్రతీరంలో వేగేశ్న నరేంద్ర వర్మ బీచ్ ఆర్ట్ వేయించారు. సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ చంద్రబాబు ముఖాకృతిని రూపొందించారు. బాబుతోనే మేం, చంద్రబాబుకు న్యాయం జరగాలి అనే నినాదాలను తన బీచ్ ఆర్ట్ లోపొందుపరిచారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు, బాపట్ల నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఎలుగెత్తారు.

Chandrababu
Arrest
Vegeshna Narendra Varma
Bapatla
TDP
Chintakayala Vijay
ITDP

More Telugu News