Raja Singh: తెలంగాణలో అసలు ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నారనే డేటా కేటీఆర్ కు తెలుసా?: రాజా సింగ్

Raja Singh asks does KTR know how many double bedroom houses being distributed
  • డబుల్ బెడ్రూం ఇళ్ల నేపథ్యంలో కేటీఆర్ పై రాజా సింగ్ విమర్శలు
  • ఇళ్ల పంపిణీపై కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని వెల్లడి
  • బిల్డప్ తప్పితే, ప్రజలకు ఇళ్లు ఇస్తున్న దాఖలాలు లేవన్న బీజేపీ ఎమ్మెల్యే

డబుల్ బెడ్రూం ఇళ్ల అంశంలో మంత్రి కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీపై కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని రాజా సింగ్ విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రచార ఆడంబరం తప్పితే, ప్రజలకు ఇళ్లు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఇళ్లను కట్టి వదిలేస్తున్నారని వెల్లడించారు. అసలు, తెలంగాణలో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తున్నారనే డేటా కేటీఆర్ కు తెలుసా? అని రాజా సింగ్ ప్రశ్నించారు. 2.16 లక్షల ఇళ్లు కట్టినట్టు గూగుల్ ద్వారా తెలిపారు కానీ, వాస్తవానికి లక్ష ఇళ్లు కూడా కట్టలేదని అన్నారు. కనీసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అయినా ఇళ్లు నిర్మించి ఇవ్వండి అని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News