Rahul Gandhi: కూలీ అవతారంలో రాహుల్‌గాంధీ.. రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసు మోసిన కాంగ్రెస్ అగ్రనేత.. వీడియో ఇదిగో!

Congress Leader Rahul Gandhi wears red shirt and lifts luggage at railway station
  • ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన రాహుల్‌గాంధీ
  • ఎరుపు రంగు కూలీ షర్ట్, చేతికి బ్యాడ్జ్ ధరించిన కాంగ్రెస్ నేత
  • పోర్టర్ల సమస్యలను శ్రద్ధగా విన్న వయనాడ్ ఎంపీ
  • వారి గదికి వెళ్లి పరిశీలన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైల్వే స్టేషన్‌లో కూలీ అవతారం ఎత్తి సూట్‌కేసు మోశారు. ఈ రోజు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌ను సందర్శించిన రాహుల్ అక్కడి పోర్టర్లను కలిశారు. ఎరుపు రంగు కూలీ షర్ట్, చేతికి బ్యాడ్జ్ ధరించి తలపై లగేజీ పెట్టుకుని మోశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోర్టర్లతో మాట్లాడిన రాహుల్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారుండే గదికి వెళ్లి పరిశీలించారు. 

    వారిపక్కన కూర్చుని సమస్యలు ఆరా తీశారు. ఈ సందర్భంగా కూలీలు రాహుల్‌తో కలిసి సెల్ఫీ దిగారు. ఆయనను ప్రశంసిస్తూ పోర్టర్లు నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కాంగ్రెస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రజానేత రాహుల్‌గాంధీ ఆనంద్‌ విహార్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్లను కలిశారని తెలిపింది. 

    రాహుల్‌ను కలవాలని ఉందంటూ పోర్టర్లు ఇటీవల పేర్కొన్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ రోజు రైల్వే స్టేషన్‌కు వెళ్లి వారిని కలిసి మాట్లాడారు. వారు చెప్పింది శ్రద్ధగా విన్నారు. భారత్ జోడో యాత్ర కొనసాగుతుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ పేర్కొంది. 

  • Loading...

More Telugu News