Sabitha Indra Reddy: 2వ తరగతి బాలికలకు లిఫ్ట్ ఇచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Minister Sabitha indra reddy offered lift to second grade students
  • మంత్రి సబిత కాన్వాయ్ వెళుతుండగా దారిలో కాలినడకన ఇంటికి వెళుతూ కనిపించిన ఇద్దరు గిరిజన బాలికలు
  • చిన్నారులను కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దింపిన మంత్రి
  • మంత్రి తీరుతో మురిసిపోయిన తండావాసులు

విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇద్దరు బాలికలను తన కారు‌లో ఎక్కించుకుని వారి ఇంటి వద్ద దిగబెట్టారు. మహేశ్వరం మండలం గొల్లూరు నుంచి పెద్ద గోల్కోండ ఓఆర్ఆర్ వైపు మంత్రి వెళుతుండగా దారిలో గొల్లూరు తండాకు చెందిన 2వ తరగతి బాలికలు కాలినడకన ఇంటికెళుతూ కనిపించారు. దీంతో, వెంటనే కారు ఆపిన మంత్రి సబిత వారిని కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దింపారు. ఇది తెలుసుకుని తండావాసులు మురిసిపోయారు.

  • Loading...

More Telugu News