Donald Trump: డొనాల్డ్ ట్రంప్ మరణించారంటూ కొడుకు ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్.. కలకలం

Donald Trump Jrs social media account briefly hacked
  • తన తండ్రి మృతి చెందారంటూ పెద్ద కొడుకు ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్
  • ట్రంప్ జూనియర్ ఖాతా హ్యాక్‌కు గురైనట్లు గుర్తింపు
  • తాను మరణించినట్లుగా జరిగిన ప్రచారాన్ని ఖండించిన మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపింది. ట్రంప్ తనయుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సోషల్ మీడియా ఖాతా నుంచి ఈ పోస్ట్ రావడం గమనార్హం. అయితే ట్రంప్ జూనియర్ అకౌంట్ హ్యాక్ అయిందని ఆ తర్వాత తెలిసింది.

ఈ రోజు ఉదయం ట్రంప్ పెద్ద కొడుకు ఖాతా నుంచి తన తండ్రి మృతి చెందారంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ వచ్చింది. అంతేకాదు, 2024 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా అందులో ఉంది. అయితే ఈ ఖాతా హ్యాక్ అయినట్లు గుర్తించి, ఈ పోస్టును తొలగించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాను మృతి చెందినట్లు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నానంటూ మరో సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదిక ద్వారా తెలిపారు.
Donald Trump
america

More Telugu News