mohammad siraj: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా మహమ్మద్ సిరాజ్

  • ఆసియా కప్‌లో శ్రీలంకపై 6 వికెట్లు తీసి అదరగొట్టిన సిరాజ్
  • వన్డే ర్యాంకింగ్స్‌లో రెండోసారి నెంబర్ వన్ స్థానానికి మహమ్మద్ సిరాజ్
  • టాప్ టెన్ బ్యాటర్లలో శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
Mohammed Siraj back to No 1 in ICC odi rankings

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు మహమ్మద్ సిరాజ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి ఏకంగా 1వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు తీసి 21 పరుగులు ఇచ్చి, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో సిరాజ్ అగ్రస్థానానికి రావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య నెంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. ఇప్పుడు మరోసారి ఈ స్థానానికి చేరుకున్నాడు. 

బౌలింగ్‌లో సిరాజ్ తర్వాత హేజిల్ వుడ్, ట్రెండ్ బౌల్డ్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తొమ్మిది స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి వచ్చాడు.

టీమిండియా ఆటగాడు కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు దిగజారి 9వ స్థానానికి పరిమితమయ్యాడు. బుమ్రా రెండు స్థానాలు ఎగబాకి 27వ స్థానంలోకి వచ్చాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 50వ ర్యాంకులోకి వచ్చాడు. బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే శుభ్‌మన్ గిల్, కోహ్లీ, రోహిత్ శర్మలు వరుసగా రెండు, ఎనిమిది, పదో స్థానాల్లో ఉన్నారు. భారత్ నుండి టాప్ 20 ఆల్ రౌండర్‌లలో పాండ్యా ఆరో స్థానానికి ఎగబాకాడు. పాక్ బ్యాట్సుమన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

More Telugu News