Sake Sailajanath: రాష్ట్రంలో జగన్ ప్రతీకార రాజకీయం: శైలజానాథ్

pcc former president sake sailajanath extends support to nara bhuvneshwari
  • నారా భువనేశ్వరిని పరామర్శించిన పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్
  • రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్య   
  • చంద్రబాబు-రాజశేఖర్ రెడ్డి పోరాటం హుందాగా ఉండేదని గుర్తుచేసుకున్న వైనం
రాష్ట్రంలో పగ, ప్రతీకారాలు రాజ్యమేలుతున్నాయని, కక్షసాధింపు కోసం ప్రభుత్వం ప్రైవేటు లాయర్లను పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థాంగి నారా భువనేశ్వరిని ఆయన బుధవారం పరామర్శించారు. 

అనంతరం శైలజానాథ్ మాట్లాడుతూ.."మంత్రులు శాఖాపరమైన అంశాలు మానేసి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ప్రజాసమస్యలపై చంద్రబాబు-రాజశేఖర్ రెడ్డిల పోరాటం ఎంతో హుందాగా ఉండేది. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మునుపెన్నడూ చూడలేదు. రాష్ట్రంలో పరిపాలన కనిపించట్లేదు. చంద్రబాబు వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఆయన్ని ఇలా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడం బాధాకరం. ఎన్టీఆర్ అభిమానిగా భువనేశ్వరి గారంటే నాకెంతో గౌరవం. ఏనాడు బయటకు రాని ఆమె ఇప్పుడిలా బాధపడుతుండటం ఎంతో కలచివేస్తోంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.
Sake Sailajanath
Nara Bhuvaneswari
Telugudesam
Congress

More Telugu News