Shaheen Afridi: తన భార్యను మరోసారి పెళ్లి చేసుకున్న పాకిస్థాన్ క్రికెటర్

Pakistan Cricketer Shaheen Afridi married his wife for second time
  • ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షా, షాహీన్ ల వివాహం
  • షాహీన్ బిజీ షెడ్యూల్ వల్ల సన్నిహితుల మధ్య పెళ్లి
  • ఇప్పుడు గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న నవ జంట
పాకిస్థాన్ స్టార్ ఫార్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిదీ తన భార్య అన్షా ఆఫ్రిదీని రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. కరాచీలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్షా, షాహీన్ వివాహం జరిగింది. అయితే షాహీన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పెళ్లిని కేవలం అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే నిర్వహించారు. దీంతో, మరోసారి ఘనంగా పెళ్లి చేసుకోవాలని షాహీన్ దంపతులు భావించారు. దీంతో, మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు సహచర ఆటగాళ్లు హాజరయ్యారు. మరోవైపు షాహీన్ భార్య అన్షా మరెవరో కాదు. పాక్ క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ కూతురే.
Shaheen Afridi
Marriage
Pakistan

More Telugu News