Ambati Rambabu: గాజు గ్లాసు గుర్తు మళ్లీ జనసేనకే కేటాయించడంపై అంబటి రాంబాబు స్పందన

Ambati Rambabu responds on Glass symbol to ysrcp
  • మళ్లీ గ్లాసు గుర్తు ఎందుకు... సైకిలే తీసుకుంటే పోలా! అని అంబటి చురకలు
  • టీడీపీతో కలిసి వెళతామని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో సెటైర్
  • అంబటి రాంబాబు ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన 
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేన పార్టీకే కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. మళ్లీ గ్లాసు గుర్తు ఎందుకు... సైకిలే తీసుకుంటే పోలా! అని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్(ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ విధంగా స్పందించారు. అంబటి వ్యాఖ్యలకు సానుకూలంగా, ప్రతికూలంగా పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు. తమకు మళ్లీ గాజు గ్లాసు కేటాయించడంపై జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ కూడా స్పందించడం తెలిసిందే.
Ambati Rambabu
Janasena
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News