Bandi Sanjay: మీ ముత్తాత హయాం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణను మోసం చేసింది: రాహుల్ పై బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay counter attacks on Rahul Gandhi
  • రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన రాహుల్
  • మోదీ తెలంగాణను అవమానించేలా మాట్లాడారని విమర్శలు
  • 1400 మంది అమరులవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనన్న బండి సంజయ్
  • పప్పూ జీ... స్క్రిప్ట్  రైటర్ ను మార్చుకోండి అంటూ వ్యంగ్యం

ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు పాత భవనంలో నిన్న రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేయగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలను ఖండించారు. ప్రధాని తెలంగాణ పట్ల అవమానకరంగా మాట్లాడారని విమర్శించారు. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. 

మీ ముత్తాత హయాం నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీయే తెలంగాణను మోసం చేసిందని స్పష్టం చేశారు. 1,400 మంది అమరులవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే, ఇప్పుడు ప్రధాని మోదీని అనడానికి సిగ్గుండాలి అని బండి సంజయ్ ఎదురుదాడి చేశారు. వందల మంది చనిపోవడానికి కారణమైన మీ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పాలి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక ఓటు-రెండు రాష్ట్రాలు అని తొలిసారి పిలుపునిచ్చింది అటల్ బిహారీ వాజ్ పేయి అని ఉద్ఘాటించారు. పప్పూ జీ ఇప్పటికైనా స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News