Arjuna Ranatunga: వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో అశ్విన్ లేకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసిన లంక దిగ్గజం

 Arjuna Ranatunga opines on Aswhin was not selected for world cup Team India squad
  • అక్టోబరు 5 నుంచి భారత్ లో వరల్డ్ కప్
  • ఇటీవల వరల్డ్ కప్ కోసం టీమిండియా ఎంపిక
  • రవిచంద్రన్ అశ్విన్ కు దక్కని చోటు
  • అశ్విన్ లేకుండా టీమిండియా బౌలింగ్ విభాగం పరిపూర్ణం కాదన్న రణతుంగ

భారత్ లో మరి కొన్నిరోజుల్లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. అయితే వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో ఆఫ్ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ కు చోటు దక్కలేదు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లకు వరల్డ్ కప్ జట్టులో స్థానం కల్పించారు. దీనిపై శ్రీలంక మాజీ సారథి అర్జున రణుతుంగ స్పందించారు. వరల్డ్ కప్ లో ఆడే భారత జట్టులో అశ్విన్ ను తీసుకోకపోవడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

అశ్విన్ ఒక మ్యాచ్ విన్నర్ అని, ఉపఖండం పిచ్ లపై అతడు వికెట్లు పడగొట్టగలడని వివరించారు. అశ్విన్ ఇప్పటి తరం క్రికెటర్లతో పోల్చితే మైదానంలో పాత తరం క్రికెటర్లలా, కొద్దిగా నిదానంగా కనిపించవచ్చేమో కానీ, అశ్విన్ లాంటి స్పిన్నర్ జట్టులో లేకపోవడం ఒక లోటుగా మిగిలిపోతుందని రణతుంగ అభిప్రాయపడ్డారు. 

వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. జడేజా, అక్షర్ పటేల్ లెఫ్టార్మ్ స్పిన్నర్లు కాగా, కుల్దీప్ యాదవ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నరే కానీ చైనామన్ బౌలర్. అశ్విన్ జట్టులో ఉండి ఉంటే బౌలింగ్ విభాగంగా పరిపూర్ణంగా ఉండేదని రణతుంగ అభిప్రాయపడ్డారు. అశ్విన్ ను జట్టులోకి తీసుకుంటనే బాగుంటుందని సలహా ఇచ్చారు.

  • Loading...

More Telugu News