Twitter: ఫీజు కడితేనే ట్విట్టర్ వాడుకోగలరు.. త్వరలో అమలు!

Elon Musk hints Twitter will turn into paid service all users will have pay to use it
  • స్వల్ప ఫీజును ప్రవేశ పెట్టే ప్రణాళిక
  • దీనిపై సంకేతం ఇచ్చిన ఎలాన్ మస్క్
  • బాట్స్ రూపంలోని నకిలీ ఖాతాలకు చెక్ పెట్టే యత్నం

ట్విట్టర్ లో సంస్కరణలు ఇంకా ముగిసినట్టు కనిపించడం లేదు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయానికి తెరతీయనున్నారు. 75 శాతం మంది ఉద్యోగులను పీకిపారేసిన మస్క్.. ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చడం తెలిసిందే. బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ సేవను సైతం తీసుకొచ్చారు. అధికారిక, ధ్రువీకృత అకౌంట్ కు చిహ్నంగా బ్లూటిక్ ను పేర్కొంటూ, దానికి చందా విధానాన్ని అమలు చేస్తున్నారు. త్వరలో ప్రతి యూజర్ నుంచి ఎంతో కొంత ఫీజు వసూలు చేయాలనే ప్రతిపాదనతో ఆయన ఉన్నారు. అదే చేస్తే ట్విట్టర్ పెయిడ్ ప్లాట్ ఫామ్ గా మారనుంది.

దీనిపై మస్క్ స్వయంగా సంకేతం ఇచ్చారు. ఫీజు ఎంత ఉంటుందన్నది ఆయన ప్రకటించలేదు. కాకపోతే ప్రతి ఒక్క యూజర్ స్వల్ప ఫీజు చెల్లించేట్టుగా దీన్ని ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. నకిలీ ఖాతాలను ఏరిపారేయడమే దీని వెనుక ఉద్దేశ్యంగా ఉంది. ట్విట్టర్ కు 55 కోట్ల యూజర్లు ఉన్నారని, ప్రతి రోజూ 10-20 కోట్ల పోస్ట్ లను పెడుతుంటారని  మస్క్ స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు తెలియజేయడం గమనార్హం. కాకపోతే ఇందులో బాట్స్ రూపంలో పనిచేస్తున్న నకిలీ ఖాతాలు ఎన్ని? మనుషులే నిజంగా ఉపయోగించేవి ఎన్ని? అన్న దానిపై మస్క్ కు సైతం స్పష్టత లేదు. గతేడాది ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లు పెట్టి మస్క్ కొనుగోలు చేయడం తెలిసిందే. అంతకు ముందు నిషేధించిన డోనాల్డ్ ట్రంప్ సహా ఎన్నో ఖాతాలను ఆయన పునరుద్ధరించారు.

  • Loading...

More Telugu News