Big Boss 7: ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని అనుకోలేదు: షకీలా

Shakeela Reaction On Elimination From BigBoss
  • బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన షకీలా
  • హౌస్ నుంచి బయటకు వస్తూ కన్నీటి పర్యంతమైన నటి
  • ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్ష

బిగ్ బాస్ హౌస్ నుంచి సినీ నటి షకీలా ఆదివారం ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఇంత త్వరగా తాను బయటకు వచ్చేస్తానని అనుకోలేదని షకీలా చెప్పారు. హౌస్ నుంచి షకీలీ ఎలిమినేట్ అయి బయటకు వస్తుండగా హౌస్ మేట్ దామిని ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా’ అంటూ పాడగా హౌస్ మేట్స్ తో పాటు షకీలా కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. అయితే, ఎలిమినేట్ అయినందుకు తనకేం బాధగా లేదని షకీలా చెప్పారు. ఇంట్లో వాళ్లందరూ బాగుండాలని, బాగా ఆడాలని చెబుతూ వీడ్కోలు పలికారు.

హౌస్ లో ఉన్నవారు ఎవరు ఎలాంటి వారని నాగార్జున అడగగా.. హౌస్ మేట్స్ ఫొటోలపై పెయింట్ వేస్తూ ఒక్కొక్కరి గురించి షకీలా వివరించారు. ప్రియాంక అందరితోనూ ఎప్పుడూ స్నేహంగా మెసలుకుంటుందని, తనకు తానే గొప్పవాడిగా ప్రిన్స్ యావర్ ఫీలవుతుంటాడని, పల్లవి ప్రశాంత్ ఆవేశపరుడని, దామిని నమ్మకస్తురాలని చెప్పారు. ఇక రతికా రోజ్ హృదయం బండరాయిలాంటిదని, ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని శివాజీని షకీలా మెచ్చుకున్నారు.


  • Loading...

More Telugu News