Yogi Adityanath: యముడు మీకోసం వెయిట్ చేస్తుంటాడు జాగ్రత్త! పోకిరీలకు సీఎం యోగి వార్నింగ్

Yamraj waiting for you Yogi Adityanaths warning to those harassing women
  • యువకుల పోకిరీ చేష్టలతో యూపీ బాలిక దుర్మరణం
  • ఘటనపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
  • మహిళలను వేధించే వారి కోసం యముడు వెయిట్ చేస్తుంటాడంటూ స్ట్రాంగ్ వార్నింగ్

యువకుల వేధింపుల కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై బాలిక దుర్మరణం చెందిన ఘటన ఉత్తరప్రదేశ్ ను కుదిపేస్తోంది. ఈ దారుణంపై స్పందిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోకిరీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలను వేధించే వారి కోసం యమధర్మరాజు వెయిట్ చేస్తుంటాడంటూ హెచ్చరించారు. 

యువకుల వేధింపుల కారణంగా అంబేద్కర్ నగర్‌లో శుక్రవారం 11వ తరగతి చదువుతున్న ఓ బాలిక దుర్మరణం చెందింది. బైక్ వెనుక సీటులో కూర్చుని స్నేహితుడితో కలిసి వెళుతున్న ఓ యువకుడు సైకిల్‌పై వెళుతున్న బాలిక చున్నీ పట్టి లాగడంతో ఆమె కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న మరో బైక్ ఆమెపై నుంచి వెళ్లడంతో గాయాలపాలై చనిపోయింది. ఈ ఘటనకు కారణమైన యువకులు ఇద్దరినీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితులను సెహ్‌బాజ్, అర్బాజ్‌గా గుర్తించారు. బాలికను బైక్‌తో ఢీకొన్న యువకుడిని ఫైజల్‌గా గుర్తించారు. వీరు ముగ్గురూ కలిసే ఈ మృత్యుక్రీడలో పాల్గొన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News