Sudheer Reddy: హైదరాబాదులో చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ.... హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

BRS MLA Sudheer Reddy attends TDP Rally in support for Chandrababu
  • స్కిల్ కేసులో చంద్రబాబు
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • దేశంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు
  • వనస్థలిపురం ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు సెప్టెంబరు 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కాగా, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇవాళ హైదరాబాదులోని వనస్థలిపురంలోనూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఈ ర్యాలీకి హాజరై టీడీపీ మద్దతుదారులకు సంఘీభావం తెలిపారు. 

కాగా, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిమేర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ర్యాలీలో బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.
Sudheer Reddy
TDP Rally
Chandrababu
Vanasthalipuram
Hyderabad
BRS
Telangana

More Telugu News