Congress: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 ప్రధాన హామీలు ఇవే!

  • మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
  • హైదరాబాద్ తుక్కుగూడలో కాంగ్రెస్ విజయభేరి సభ
  • 6 హామీలను ప్రకటించిన సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ
These are Telangana six poll assurances

తెలంగాణలో మరో రెండు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే ఫార్ములాను తెలంగాణలోనూ అమలు చేయాలని భావిస్తోంది. ఇవాళ హైదరాబాదులోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 6 ప్రధాన హామీలను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నారు.


కాంగ్రెస్ హామీలు...

1. మహాలక్ష్మి పథకం: మహిళలకు ప్రతి నెల రూ.2,500 చెల్లిస్తారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం.
2. రైతు భరోసా: రైతులకు, కౌలు రౌతులకు ప్రతి ఏడాది రూ.15 వేలు. వ్యవసాయ కూలీలకు ప్రతి ఏడాది రూ.12 వేలు. వరిపంటకు క్వింటాల్ పై రూ.500 బోనస్.
3. గృహజ్యోతి: నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు.
4. ఇందిరమ్మ ఇళ్లు: ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు. ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు. తెలంగాణ కోసం పోరాడిన యోధులకు 250 చదరపు గజాల స్థలం.
5. యువ వికాసం: తెలంగాణలోని విద్యార్థులకు రూ.5 లక్షల విలువ చేసే విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలోనూ ఇంటర్నేషనల్ స్కూళ్లు.
6. చేయూత: అర్హులైన వారికి నెలకు రూ.4 వేల చొప్పున పెన్షను. రూ.10 లక్షల మేర రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా సదుపాయం.


  • Loading...

More Telugu News