Elon Musk: గూగుల్ సహవ్యవస్థాపకుడి భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్? కూలిపోయిన కాపురం!

Google cofounder sergey brin divorce finalized amid rumors of Elon musk affair with his wife
  • మే నెలలో గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, నికోల్ దంపతుల విడాకులు ఖరారు
  • 2021 నుంచి విడిగా ఉంటున్న వైనం, 2022లో విడాకులకు దరఖాస్తు చేసుకున్న సెర్గీ
  • సెర్గీ భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్ కారణంగా సెర్గీ కాపురం కూలిందన్న అంతర్జాతీయ మీడియా
  • మీడియా కథనాలను అప్పట్లోనే ఖండించిన నికోల్, ఎలాన్ మస్క్
గూగుల్ సహవ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తన భార్యకు విడాకులు ఇచ్చేశారు. మే నెలలోనే వారి విడాకులు ఖరారయ్యాయి. ఇన్నాళ్లకు ఈ విషయం బయటకు వచ్చింది. అయితే, సెర్గీ కాపురం కూలిపోవడానికి ఎలాన్ మస్క్ కారణమన్న వార్త అంతర్జాతీయ మీడియాలో చాలాకాలంగా వైరల్‌గా అవుతోంది. తన భార్యతో ఎలాన్ మస్క్ ఎఫైర్‌ గురించి తెలియగానే సెర్గీ బ్రిన్ విడాకుల నిర్ణయానికి వచ్చేశారట. సెర్గీ, ఎలాన్ మస్క్‌ల స్నేహ బంధానికి కూడా ఫుల్ స్టాప్ పడిందనేది ఈ వార్తల సారాంశం. 

2015లో తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చే సమయంలో సెర్గీకి నికోల్ షానహాన్‌తో పరిచయమైంది. ఆమె లాయర్‌గా పనిచేస్తున్నారు. 2018లో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. వారికి ఎకో అనే నాలుగేళ్ల కూతురు ఉంది. కాగా, మస్క్‌తో నికోల్‌కు ఎఫైర్ ఉందన్న వార్త 2021లో వైరల్ అయ్యింది. అప్పటి నుంచీ వారిద్దరూ విడివిడిగా ఉండటం ప్రారంభించారట. 2022లో సెర్గీ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. 

అయితే, మీడియాలో వచ్చిన ఎఫైర్ వార్తలను మస్క్, నికోల్ ఇద్దరూ ఖండించారు. 2022లో దీనిపై స్పందించిన మస్క్ గత మూడేళ్లలో తాను నికోల్‌ను రెండు సార్లు మాత్రమే కలిసానని చెప్పుకొచ్చారు. ఆ సందర్భంలో తమ చుట్టూ బోలెడంత మంది ఉన్నారని కూడా చెప్పారు. ఎఫైర్ వార్తలు తనను నిలువెల్లా కుంగదీశాయని అప్పట్లో నికోల్ కూడా మీడియాతో వాపోయింది.
Elon Musk
Sergey Brin
Nicole Shanahan

More Telugu News