ఇండియా కూటమిలో టీడీపీ కూడా ఉంది అనడానికి ఇదే నిదర్శనం: విజయసాయిరెడ్డి
- స్కిల్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
- నారా లోకేశ్ కు అనేకమంది నేతల సంఘీభావం
- వాళ్లంతా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలవారేనన్న విజయసాయి
- వాళ్ల ఉమ్మడి ప్రణాళిక ఒక్కటేనని వెల్లడి
చంద్రబాబుకు మద్దతిస్తూ నారా లోకేశ్ కు ఫోన్ కాల్స్ చేస్తోంది కేవలం ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు చెందినవారేనని స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఇండియా కూటమిలో టీడీపీ కూడా ఉందని నిరూపితమవుతోందని తెలిపారు.
వీళ్లందరి ఉమ్మడి ప్రణాళిక ఒక్కటేనని, అధికారం కోసం చేతులు కలపడం, అందినకాడికి రాష్ట్రాన్ని దోచేయడమేనని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదని పేర్కొన్నారు.