Shubman Gill: నా లెక్క తప్పింది.. నా తప్పు వల్లే ఈ ఫలితం: శుభమన్ గిల్

I miscalculated Shubman Gill accepts mistake takes responsibility for Indias loss against Bangladesh in Asia Cup
  • కొన్ని సందర్భాల్లో అంచనాలు తప్పుతుంటాయన్న గిల్
  • తన వైపు నంచి తప్పు జరిగినట్టు ప్రకటన
  • దూకుడుగా ఆడాల్సింది కాదన్న యువ క్రికెటర్
ఆసియా కప్ లో  భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు తరఫున వీరోచితంగా పోరాడిన శుభ్ మన్ గిల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ, గిల్ మాత్రం తన అంచనాలు తప్పాయని, తనవల్లే ఓటమి అంటూ ప్రకటించడం గమనార్హం. సూపర్ 4లో భారత్ వరుసగా రెండు మ్యాచ్ ల్లో గెలవడం ద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. కానీ, శుక్రవారం నాటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉండిపోయింది.

ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ 133 బంతుల్లో 121 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. వన్డేల్లో గిల్ కు ఇది ఐదో సెంచరీ. భారత జట్టు నుంచి ఒక్కొక్కరుగా అవుటై వెళ్లిపోతున్నా, గిల్ మాత్రం క్రీజులో పాతుకుపోయి విజయం కోసం చివరి వరకు పోరాడి ప్రశంసలకు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో గిల్ మాట్లాడిన తీరు మరింత మందిని ఆలోచింపజేసింది. 

‘‘కొన్ని సందర్భాల్లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఎంతో అడ్రెనలిన్ (ఉత్సాహాన్నిచ్చే హార్మోన్) ఉంటుంది. దాంతో అంచనాలు తప్పుతాయి. ఇది నా వైపు నుంచి జరిగిన అంచనాల తప్పు. నేను అవుటైనప్పుడు ఇంకా ఎంతో సమయం (ఓవర్లు) మిగిలి ఉంది. నేను కనుక ఆ సమయంలో అంత దూకుడుగా బ్యాటింగ్ చేయకపోతే లైన్ ను అధిగమించేవాళ్లం.  కానీ, ఇవన్నీ అనుభవాలు. అదృష్టం ఏమిటంటే అది ఫైనల్ గేమ్ కాదు’’ అని గిల్ చెప్పాడు. తన మాటల ద్వారా ఓటమి బాధ్యత తనదేనన్నట్టు గిల్ సంకేతం ఇచ్చాడు.
Shubman Gill
accepts mistake
responsibility
Indias loss
Bangladesh
Asia Cup

More Telugu News