YashoBhoomi: ఢిల్లీలో మరో భారీ కట్టడం 'యశోభూమి'.. ఫొటోలు, వీడియో ఇవిగో!

PM Modi will inaugurate Indias largest convention center YashoBhoomi On Sunday
  • ద్వారక ప్రాంతంలో నిర్మించిన కేంద్ర ప్రభుత్వం
  • ఆదివారం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • అన్ని గదుల్లో కలిపి 11 వేల మంది కూర్చునే ఏర్పాట్లు
దేశ రాజధానిలో మరో భారీ కట్టడం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించిన ‘యశోభూమి’ ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసీసీ) కు ప్రధాని యశోభూమిగా నామకరణం చేసింది. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఢిల్లీలోని ద్వారకలో 73 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం రూపుదిద్దుకుంది. 

యశోభూమిలో ప్రధాన ఆడిటోరియంతో పాటు మొత్తం 15 కన్వెన్షన్ హాల్స్, ఓ బాల్ రూమ్, మరో 13 మీటింగ్ రూమ్ లు ఉన్నాయి. ఈ గదులు అన్నింటిలో మొత్తం 11 వేల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధాన ఆడిటోరియంలోనే 6 వేల మంది కూర్చోవచ్చు. బాల్ రూమ్ లో 2,500 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు. యశోభూమి ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కింగ్ లో 34,808 వాహనాలను పార్క్ చేయవచ్చు.



YashoBhoomi
largest convention center
Modi will inaugurate
Sunday

More Telugu News