Thummala: కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపిన తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageswar Rao resigns to BRS
  • బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన తుమ్మల
  • ఇంతకాలం తనకు సహకరించినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన వైనం
  • సాయంత్రం కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ బై చెబుతూ, రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించారు. 'తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదములు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను' అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తనకు బీఆర్ఎస్ టికెట్ ను కేసీఆర్ ఇవ్వకపోవడంపై తుమ్మల తీవ్ర అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. మరోవైపు తుమ్మల కాంగ్రెస్ లోకి చేరబోతున్నారు. ఈ సాయంత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 

  • Loading...

More Telugu News