Vijayasai Reddy: రానున్న ఎన్నికలపై విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Elections are between pack of wolves and a lion says Vijayasai Reddy
  • ప్రతిపక్షాలను తోడేళ్ల గుంపుతో పోల్చిన విజయసాయి
  • వచ్చే ఎన్నికలు తోడేళ్ల గుంపుకు, ఒక సింహానికి మధ్య జరగనున్నాయన్న విజయసాయి
  • అవకాశవాదం, నిజాయతీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని వ్యాఖ్య
2024లో ఏపీలో జరగబోయే ఎన్నికల గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య జరగనున్నాయని... తోడేళ్ల గుంపుకు, ఒక సింహానికి మధ్య జరగబోతున్న ఎన్నికలని ఆయన అన్నారు. అధికారం కోసం పరితపిస్తున్న వారికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న వారికి మధ్య ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. యూటర్న్ రాజకీయాలు - విశ్వసనీయత, అవకాశవాదం - నిజాయతీ, కుల రాజకీయాలు - ఐకమత్యం, క్యాపిటలిజం - అందరికీ లబ్ధి, అన్ని ప్రతిపక్ష పార్టీలు - సీఎం జగన్ నాయకత్వంలోని ఏపీ ప్రజలకు మధ్య జరగబోతున్న ఎన్నికలని అభివర్ణించారు.

Vijayasai Reddy
Jagan
YSRCP
Telugudesam

More Telugu News